Search for:

చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ | Chocolate French Toast | Kids Recipes | Bread Recipes | French Toast

చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ ఒక వెరైటీ రెసిపీ. విదేశాలలో ఫ్రెంచ్ టోస్ట్ను పొద్దున్నే అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మీరు చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ను ఎలా చేయాలో చూడచ్చు. ఇది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.

#chocolatefrenchtoast #homecookingtelugu #breadrecipe #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase

Here’s the link to this recipe in English:

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 2

ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు:

బ్రెడ్ లోఫ్
గుడ్లు – 3
చాక్లెట్ మిల్క్ – 1 / 2 కప్పు
బ్రౌన్ షుగర్ – 2 టీస్పూన్లు
వనిల్లా ఎసెన్స్ – 1 టీస్పూన్
కోకో పొడి – 1 / 2 టీస్పూన్
వెన్న

చాక్లెట్ గనాష్ చేయడానికి కావలసిన పదార్థాలు

ఫ్రెష్ క్రీం – 1 / 2 కప్పు
డార్క్ చాక్లెట్ – 100 గ్రాములు

తయారుచేసే విధానం:

ముందుగా బ్రెడ్డు లోఫ్ను ఒక అంగుళం అంత బ్రెడ్డు స్లైసులు వచ్చేట్టు కట్ చేసుకోవాలి

ఒక బౌల్లో గుడ్లు పగలకొట్టి వేసి, అందులో చాక్లెట్ మిల్క్, బ్రౌన్ షుగర్, వనిల్లా ఎసెన్స్, కోకో పొడి వేసి బాగా కలపాలి

ఈ గిలకొట్టిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసి పరిచిన తరువాత, బ్రెడ్డు స్లైసులను వేసి రెండు వైపులా రెండు-మూడు సెకన్ల పాటు ఉంచి నానపెట్టాలి

ఒక పాన్లో వెన్న వేసి, అందులో ముంచిన బ్రెడ్డు స్లైసులను పెట్టి వేయించాలి

చాక్లెట్ గనాష్ చేయడానికి ఒక గిన్నెలో ఫ్రెష్ క్రీం వేసి, అందులో డార్క్ చాక్లెట్ వేసి, పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి కరిగించాలి

చాక్లెట్ పూర్తిగా కరిగిన తరువాత పొయ్యి కట్టేయచ్చు

వేయించిన బ్రెడ్డు స్లైసులను ఒక దాని మీద ఒకటి పెట్టి, వాటి మీద చాక్లెట్ గనాష్ వేసి, చాక్లెట్ చిప్స్, బాదాం తురుముతో గార్నిష్ చేసుకోవచ్చు

అంతే, చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ తయారైనట్టే

You can buy our book and classes on

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –

A Ventuno Production :